బయోటెక్నాలజీ లో షేక్ సమీన కు వైవీయూ డాక్టరేట్
1 min readపల్లెవెలుగు వెబ్ కడప: యోగి వేమన విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ శాఖ పరిశోధకురాలు షేక్ సమీన కు వైవీయూ డాక్టరేట్ ప్రదానం చేసింది. బయోటెక్నాలజీ ప్రొఫెసర్ ఎ. చంద్రశేఖర్పర్యవేక్షణలో ” నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ పద్దతిని ఉపయోగించి, కొర్రలు యందు దిగుబడిని పెంచేందుకు రికాంభినెంట్ ఇనెబ్రీడ్ లైన్స్ ” ని అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన భారతదేశములో మొదట ఆధునిక జీనోమ్ ఆధారిత పరిశోధన కావడం విశేషం. ఈమె చేసిన పరిశోధనకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వైవీయూ పరీక్షల నిర్వహణాధికారి ప్రోఫెసర్ ఈశ్వర్ రెడ్డి తెలిపారు.షేక్ సమీనా రాసిన పరిశోధన వ్యాసాలు పలు జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. జాతీయ సరస్సులలో పరిశోధన పత్రాలు సమర్పించారు. షేక్ షమీనా డాక్టరేట్ అందుకున్న సందర్భంగా వై వి యు ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి , రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. రఘునాథరెడ్డి, బయోటెక్నాలజీ విభాగ అధిపతి ఆచార్య పి. చంద్రమతి శంఖర్, ఆచార్య ఇ.సి. సురేంద్రనాథరెడ్డి, బోధన, బోధ నేతరి సిబ్బంది పరిశోధక విద్యార్థులు అభినందించారు.