మినీ అంగన్వాడీ కేంద్రాలను..మెయిన్ అంగన్వాడీ కేంద్రాలకు అప్ గ్రేడ్ చేయాలి
1 min readమంత్రిని కలిసిన ఏలూరు జిల్లా మినీ అంగన్వాడీ వర్కర్స్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా గత 15 సంవత్సరాలుగా మినీ అంగనవాడిలు గా పనిచేస్తు, గతంలో తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో మినీ అంగన్వాడీ కేంద్రాలుగా ఇచ్చి ఉన్నారని, నేడు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలతో పాటు మినీ అంగనవాడి కేంద్రాల వర్కర్ కు అధిక పని ఒత్తిడి భారం పెరిగిందని ఏపీ మినీ అంగన్వాడి వర్కర్స్ అసోసియేషన్ సంఘ సభ్యులు రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి వినతి పత్రాన్ని అందజేశారు. మా సమస్యలను గత ప్రభుత్వంలో అనేకమార్లు కలిసి వినతి పత్రాలను అందజేశామని వారు సానుకూలంగా స్పందించి మెయిన్ సెంటర్స్ చేస్తామని హామీ ఇచ్చి సర్వే కూడా చేశారన్నారు. కానీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో గత సంవత్సరం మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేశారన్నారు. ఇదే మన రాష్ట్రంలో 7000 రూపాయలు తో చాలీచాలని జీతభత్యాలతో మరియు పనిభారం పెరగడంతో మినీ అంగన్వాడి టీచరుగా, వర్కర్స్ గా వారాంతపు సెలవు కూడా లేకుండా పనిచేయడం భారంగా ఉందని మంత్రికి విజ్ఞప్తి చేశారు. కనీసం వేసవి సెలవులు కూడా ఉండవని మా స్కూల్స్ అద్దె భవనాలలో నడిపించడుస్తున్నామని మాకు ఇచ్చే 7000 రూపాయలతో అద్దెలు, కరెంట్ బిల్, వంటగ్యాస్, కూరగాయలు, ఆకుకూరలు, సమకూర్చుకుంటూ అదే విధంగా బిల్స్ వచ్చేంతవరకు జీతంతో సరిపెట్టుకోవడం ప్రాణ సంకటగా ఉందని వాపోయారు. ఇలా మినీ అంగన్వాడీ వర్కర్స్ గా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని ఈ మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి ని కరిసిన వారిలో ఏలూరు జిల్లా మినీ అంగన్వాడీ వర్కర్స్ పి సుభాషిని, జి రామలక్ష్మి, ఎన్ నిర్మల, ఆర్ ప్రసన్న, సత్య జ్యోతి, సరోజిని, రత్నకుమారి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.