NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జల్ జీవన్ మిషన్ ద్వారా త్రాగునీటికి శాశ్వత పరిష్కారం- ఎమ్మెల్యే

1 min read

ఆదోని, న్యూస్​ నేడు:  జల్ జీవన్ మిషన్ జెజెఎం పథకం ద్వారా త్రాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి  తెలియజేశారు.  గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఆదోని మరియు మంత్రాలయం ప్రజలకు చాలా పెద్ద శుభవార్త అని తెలిపారు. ఎందుకంటే పులికనుమ ప్రాజెక్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం జెజెఎం నిధుల ద్వారా దాదాపు 583 కోట్ల తో శాశ్వత త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని తెలిపారు.  నేను ఎమ్మెల్యే అయిన తరవాత త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎంతో మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నాయకులను, నేతల్ని కలసి వినతి పత్రాలు అందజేటం ద్వారా ఈరోజు ఇంతటి పెద్ద భారీ ప్రాజెక్ట్ మన అదోనీ మరియు వెనుకబడ్డ ప్రాంతం మంత్రాలయం నియోజక వర్గానికి వచ్చిందని తెలిపారు.ఇప్పటికే దీనికి సంబంధించిన తొలి అడుగులు పూర్తీ అయ్యాయని తొందర్లోనేప్రతి గ్రామానికీ జెజెఎం కింద వాటర్ బ్యాంక్ మరియు తద్వారా ఇంటికికి కొళాయి ఇచ్చే మంచినీరు సరఫరా చేసి,నీటి కొరత అనేది కనబడకుండా చేస్తామని తెలియజేశారు.కర్నూలు జిల్లాలో నే ఇది అతిపెద్ద నీటి ప్రాజెక్టు గా ఉండబోతుందని 0.56 టిఎంసి ల నీటిని త్రాగునీటి కోరకు ఉపయోగించి ప్రజలకు అందిస్తామని అన్నారు.  ఈ ప్రాజెక్టు ఆదోని కి ఇచ్చినందున ఎమ్మెల్యే పార్థసారథి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేశారు.

About Author