చెట్లను నాటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్ష సమగ్ర శిక్ష ,నేషనల్ గ్రీన్ కోర్ వారి సౌజన్యంతో వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నాడు శిక్ష సప్త కార్యక్రమం ఆ పాఠశాల సైన్సు ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. శిక్ష సప్త కార్యక్రమం పై విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులచే మొక్కలను నాటారు.ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు జి ఎన్ రవిశంకర్ మాట్లాడుతూ చెట్లను నాటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.కాలుష్య రహిత వాతావరణం కావాలన్నా , వర్షాలు అధికంగా కురువాలన్న ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి సుబ్రహ్మణ్యం, జీవి సుబ్బయ్య, ఎం నరసింహులు, మొయినుద్దీన్ ,విద్యార్థులు పాల్గొన్నారు.