సేవా పుస్తకాలు నవీకరించండి – యుటిఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి మండల విద్యాధికారి పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క సేవా పుస్తకాలు అప్డేట్ చేయాలని మండల విద్యాధికారి వెంకటేశ్వర నాయక్ కి యుటిఎఫ్ నంద్యాల జిల్లా సహాధ్యక్షులు శాంతి ప్రియ,జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి,సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్,మండల శాఖ అధ్యక్షులు కృష్ణా నాయక్ స్థానిక మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవా పుస్తకంలో కుటుంబ సభ్యుల వివరాలు, ఏ పి జి ఎల్ ఐ,పి ఎఫ్,జి ఐ ఎస్,ఉద్యోగుల ఆరోగ్య పథకం తదితర వివరాలు పొందుపరచాలని అదేవిధంగా మెడికల్ లీవులు,సంపాదిత సెలవులు అప్డేట్ చేయాలని కోరారు.విద్యాధికారి గారు మాట్లాడుతూ రెండు వారాల్లోగా అన్ని వివరాలు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల సహాధ్యక్షులు రమేష్ నాయుడు,మండల సీనియర్ నాయకులు నెల్లూరప్ప,శాంతి కుమార్,అంజనయ్య తదితరులు పాల్గొన్నారు.