పర్యావరణ పోషణ మొక్కలు పై విద్యార్థులకు అవగాహన..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : గడిగరేవుల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం నాడు శిక్ష సప్త కార్యక్రమం లో భాగంగా పర్యావరణ పరిరక్షణ సంకల్ప యాత్ర కృత్యాలు( మిషన్ లైఫ్ యాక్టివిటీస్ )పాఠశాలలో పోషణ దినోత్సవ నిర్వహణ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జానపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులను ఎకో క్లబ్ లుగా ఏర్పాటు చేసి విద్యార్థులచే రక రకాల మొక్కలను సేకరింపచేసి వాటిలో మహావృక్షాలు ఔషధీయ మొక్కలు విషపూరిత మొక్కలు తీగజాతి మొక్కల గురించి వాటి ఉపయోగాలను తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి పెంచడం ఎంతో అవసరమని విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ ద్వారా వివరించారు అలాగే సంపూర్ణ ఆరోగ్యం కోసం సమతుల ఆహారం తీసుకోవాలని బ్యాలెన్స్ డైట్ గురించి విద్యార్థులు వివరించారు పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమం నందు పాఠశాల ఉపాధ్యాయులు ప్రతాపరెడ్డి . మల్లికార్జునయ్య . పుష్ప కుమారి . చంద్రావతి .పీఈటి కవిత .పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు దస్తగిరమ్మ పాల్గొన్నారు.