ఎన్నికలలో యువతకు ఇచ్చిన హామీలను అమలు పరచాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్న నేషనల్ పీజీ కళాశాల నందు నేడు డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై రాము గారు అధ్యక్ష వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డివైఎఫ్ఐ నాయకులు శంకరయ్య డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డివైఎఫ్ఐ నంద్యాల జిల్లా అధ్యక్షులు మధుశేఖర్ పట్టణ కార్యదర్శి ఎస్ శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్లాస్ బోధించడానికి మాజీ డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు రాంభూపాల్ అన్నగారు హాజరయ్యారు.అనంతరం క్లాసు బోధించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ పెరిగిపోయింది. దేశంలో ఉన్న యువకులకు ఉద్యోగాలు లేక చదివిన చదువుకు ఉపాధి లేక కూలి పనులకు వెళ్లే పరిస్థితి కూడా మన దేశంలో ఉంది అదేవిధంగానే యువతను మభ్యపెడుతూ రాజకీయ నాయకులు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చే హామీలు ఏమాత్రం అమలు చేయడం లేదు ఎన్నికల సమయంలో మాత్రం జ్యోతి యువకులను మభ్యపెడుతూ వారిని మోసం చేస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఈ కాంట్రాక్ట్ మీకిప్పిస్తామంటూ ఆ కంపెనీలలో నీ ఉద్యోగాలు ఇస్తామంటూ వారికి మోసపూరితమైన వాగ్దానాలు చేస్తూ వారిని మోసం చేస్తున్నారు అన్నారు. అదేవిధంగా టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతీ యువకులకు ఇచ్చిన హామీల అమలు చేస్తామని చెప్పింది ఇప్పుడు ఏమాత్రం అమలు చేయడం లేదని వారు అన్నారు. తక్షణమే టిడిపి ప్రభుత్వం యువతకిచ్చిన నిరుద్యోగ భృతి హామీని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వ శాఖల్లో కాళీ పోస్టులు భర్తీ చేయాలని అదేవిధంగా ముఖ్యంగా టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ వాలంటీర్లకు పదివేల వేతనం ఇస్తామని చెప్పింది ఇప్పుడు వారి పరిస్థితి అయోమయంలో ఉందని తక్షణమే వారి సంగతేంటో తేల్చి చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ క్లాసులలో ఆరు నెలల కార్యచరణ రూపొందించి కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు.