చెట్లను సంరక్షించుకోవడంపై పిల్లలకు అవగాహన కల్పించాలి
1 min readరెండవ పటాలపు డి.ఎస్పి మహబూబ్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జాతీయ హరిత సంరక్షణ సమూహ కార్యక్రమాల్లో భాగంగా కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో నేడు ‘వాతావరణ కాలుష్యం -చెట్ల పెంపకం ఆవశ్యకత ‘ పై నేషనల్ గ్రీన్ కోర్ యూత్ క్లబ్ సభ్యులు వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం మరియు స్కూల్ ఆవరణలో చెట్లను నాటే కార్యక్రమాలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో రెండవ పటాలకు డి.ఎస్పీ మహబూబ్ బాషా ,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ,పట్టణ పౌర సంరక్షణ సంఘ సభ్యులు మాజీ కార్పొరేటర్ పుల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి ,పాఠశాల ఈకో క్లబ్ ఇన్చార్జి కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.