సమాజ మార్పు కి యువత సిద్ధం కావాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సమాజ మార్పు కి యువత సిద్ధం కావాలని వ్యవసాయం సంఘం రాష్ట్ర కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.భారత ప్రజాతంత్ర యువజన సమైఖ్య(డివైఎఫ్ఐ) రాష్ట్ర స్థాయి క్లాసులు రెండవ రోజుకు చేరుకున్నాయి.ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు ప్రణాళిక – కార్యచరణ అంశాన్ని బోధించారు. రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి డివైఎఫ్ఐ పోరాడుతుందన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి రాష్ట్రంలోని ప్రభుత్వాలు యువతను విస్మరిస్తున్నాయని విమర్శించారు. బడ్జెట్ లో ఆశలు లేపి నిధుల కేటాయింపులు చేయలేదన్నారు. ఒకవైపు దేశంలో పేదరికం పెరుగుతుంటే మరోవైపు అంబానీ వంటి పెట్టుబడిదారులు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లిళ్లు చేస్తున్నారన్నారు. సమానత్వం సాధించినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని దానికి నేటి యువత ఐక్యంగా పనిచేయాలన్నారు. ఈ క్లాసులో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై.రాము,జి. రామన్న మరియు ఉపాధ్యక్షులు ఎన్.వి.రమణ,పట్టణ కార్యదర్శి శివ, జిల్లా అధ్యక్షులు మధు శేఖర్ లు తదితరులు పాల్గొన్నారు.