నూతన చట్టాలపై గ్రామ, వార్డు మహిళా పోలీసులకు అవగాహన
1 min readకొత్త చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ ఆదేశాల మేరకు కర్నూలు కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషన్ లో మహిళా పియస్ డిఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్ పర్యవేక్షణలో మహిళా పియస్ సిఐ టి. అబ్దుల్ గౌస్, మహిళా పియస్ ఎస్సైలు కలిసి నూతన చట్టాల పై మహిళా పోలీసు స్టేషన్ లో ఈ రోజు మహిళా పోలీసులకు, మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జూలై 1వ తేది నుండి అమలులోకి వచ్చిన కొత్త చట్టాలైన (1) భారతీయ న్యాయ సంహిత (BNS) (2) భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) మరియు (3) భారతీయ సాక్ష్యా అధినియం (BSA) కొత్త, పాత చట్టాలలో మార్పులు, చేర్పుల పై అవగాహన కల్పించారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు దొరుకుతుందన్నారు.ప్రతి ఒక్కరూ నూతన అంశాలను నేర్చుకోవాలని సూచించారు.నూతన చట్టాలపై అవగాహన ఉంటేనే రానున్న రోజు ల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీక రించాలి. ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి, చార్జీషీట్ ఎలా తయారు చేయాలి, దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి నూతన సెక్షన్ల ప్రకారం మాత్రమే వివిధ రకాల కేసులను నమోదు చేయాల్సి ఉంటుందని మహిళా పియస్ పోలీసు అధికారులు మహిళా పోలీసులకు తెలిపారు.