ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
1 min readవిద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన జిల్లా సంక్షేమ శాఖ అధికారులు.ఏఐఎస్ఎఫ్
అధికారులు స్పందించే వరకు ఉద్యమాలు నిర్వహిస్తాం.ఏఐఎస్ఎఫ్
ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద మండలం ఇంగళదహాల్ లో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం సమస్యలకు నిలయంగా మారిందని విద్యార్థుల సమస్యలను సంక్షేమ శాఖ అధికారులు గాలికి వదిలేశారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీరంగ ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి సతీష్ కుమార్ ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి సతీష్ కుమార్ మాట్లాడుతూ హోళగుంద మండల కేంద్రంలో ఇంగళదహాల్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారులు ఘోరంగా విఫలం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 68 లక్షల 50 వేలుతో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహానికి నూతన ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా హాస్టలకు మంజూరు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ వార్డెన్ ను నియమించాలి. ఇన్చార్జి వార్డెన్ గా నియమించి వారిపై ఒత్తిడి తీసుకురావడం ఉన్నంత అధికారులు వ్యవహరిస్తున్నారు.సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో బాత్రూంలో టాయిలెట్స్ స్థానపు గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. బాత్రూంలో ఉన్నప్పటికీ సెప్టిక్ ట్యాంక్ నిండిపోవడంతో విద్యార్థులు బాత్రూంకు బయటికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.అదేవిధంగా విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు ట్రంకు పెట్టెలు దుప్పట్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు మౌలిక సదుపాయలకు కావాల్సిన వసతులను కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ లో ఉన్న విద్యార్థులు కాస్మటిక్ ఛార్జీలు కూడా వెంటనే విడుదల చేయాలి.విద్యార్థులకు అనుకూలంగా గదులు లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి విద్యార్థులను అనుకూలంగా వసతి గృహంలో అదనపు గదులను నిర్వహించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాల హాస్టల్ జిల్లా అధికారులు తమకు ఏమాత్రం పట్టదన్నట్టు విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసి ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా స్పందించి అధికారులు విద్యార్థుల సమస్యలపై దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం లేని పక్షాన జిల్లా ఉన్నంత అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రమేష్ శ్రీకాంత్ మల్లి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.