కేజీబీవీ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయండి
1 min read72గంటలు లో చర్యలు తీసుకుంటామని తెలిపిన జిల్లా విద్యాశాఖ అధికారులు అమ్ముడుపోయిరని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు.
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక మైనార్టీ కాలిని కస్తూరిబా పాఠశాలలో విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసి, ఆకలి కేకలు పట్టించు కోకుండా కేవలం కుర్చికే పరితమై ప్రిన్సిపాల్ కవితను ను తక్షణమే సస్పెండ్ చేయాలని పీ కార్యదర్శి పీడీఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కన్వీనర్ ఉదయ్ కుమార్, పి ఎస్ యు జిల్లా కార్యదర్శి సురేష్ ప్రజావేదికలో కలెక్టర్ రంజిత్ భాషకి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యా సంవత్సరం మొదలయినప్పటి నుండి విద్యార్థుల కు సరైన సమయానికి విద్యార్థుల కు మెనూ ఆహారం అందిచకుండా నిర్లక్ష్యంగా గా వ్యవహారిస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా బడుగు బలహీన వర్గాల చేపట్టిన కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారని సరైన సమయానికి మెనూ ఆహారం పెట్టకపోవడం సిగ్గుచేటున్నారు.తన ఇష్ట రాజ్యాంగ వ్యహరిస్తూ కస్తూరిబా పాఠశాల 280 పైగా విద్యార్థుల సమస్యల గాలికి వదిలేసి పట్టించ పోవడంతో బుధువారం రోజున సంఘటన పై జిల్లా అధికారులు గురువారం కస్తూరిబా పాఠశాల పాఠశాలను సందర్శించి 72 గంటలలో సస్పెండ్ చేస్తాము అని చొప్పి ఇప్పటి మూడు రోజులు అయిన కూడా చర్యలు లేకపోవడం లేదా ప్రిన్సిపాల్ కు అమ్ముడు పోయారు అని చొప్పి విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేస్తున్నాము నిద్రమత్తు వీడని నిర్లక్ష్యంగా ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకొని విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ కవిత ను మరియు వంట మనుషులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయాలని వారు అన్నారు.లేని పక్షాన దశల వారిగా ఉద్యమలు చేపడతామని హెచ్చరించారు. ఇలాంటి సమస్యలపై జిల్లా వ్యాప్తంగా అధికారులు కస్తూరిబా పాఠశాలలో సప్రైజ్ విజిట్ చేసి విద్యార్థల సమస్యలు అడిగి తెలుసుకోని విద్యార్థులకు న్యాయం చేయాలని వారు ఆవేదన వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు వేణు, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.