PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం… కర్నూలు జిల్లా ఎస్పీ

1 min read

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్  సిస్టం) కార్యక్రమానికి  105  ఫిర్యాదులు .

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ  క్యాంపు కార్యాలయంలో శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్  సోమవారం  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 105  ఫిర్యాదులు వచ్చాయి.

వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …ముగ్గురు పిల్లలతో పూట గడవడమే కష్టంగా ఉన్న నాకు, నగరంలోని  వన్ టౌన్ కు చెందిన కత్తిర రాజు  వెటర్నరీ ఆసుపత్రిలో అసిస్టెంట్ గా ఉద్యోగం ఇప్పిస్తానని ఒక లక్ష రూపాయలు తీసుకుని మోసం చేశాడని, అతని పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కర్నూలు, బుధవార పేటకు చెందిన  షేక్ మహబూబ్ భాషా ఫిర్యాదు చేశారు. 40 ఏళ్ళ క్రిందట కోనుగోలు  చేసిన 4 సెంట్ల స్ధలాన్ని నా తమ్ముడి భార్య మునెమ్మ వారి బంధువులతో కలిసి ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తుందని దేవనకోండమండలం , గుండ్లకొండ గ్రామానికి చెందిన నాగమ్మ ఫిర్యాదు చేశారు.  ధాన్యం కోసం మా బావ సోమన్న   నన్ను కొట్టి  గాయపరిచాడని వెల్దుర్తి మండలం, లక్ష్మీ పల్లె గ్రామానికి చెందిన కాంతమ్మ  ఫిర్యాదు చేశారు.నాగలాపురంలో ఉన్న 2 ఎకరాల పొలాన్ని  ముగ్గురు వ్యక్తులకు కౌలుకు ఇస్తే ఏకంగా ఆక్రమించుకోవాలని   దౌర్జన్యం చేస్తున్నారని కర్నూలు , చల్లావారి వీధికి చెందిన జ్ఞానేశ్వరమ్మ ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్  హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు,  లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు  పాల్గొన్నారు.

About Author