PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 కేసీ కెనాల్ భూములలో అక్రమ కట్టడాలు

1 min read

– విషయం తెలిసి కూడా నిమ్మకు నీరెత్తిన అధికారులు

– అధికారుల తీరుపై మండిపడుతున్న రైతులు,ప్రజలు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు  : చెన్నూరు వద్ద గల కేసీ కెనాల్( ఎస్బిఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న) భూములలో కొంతమంది వ్యక్తులు అక్కడ స్థలాలు కొనుగోలు చేసి పక్కనే ఉన్న కేసీ కెనాల్ కు సంబంధించిన విలువైన భూములను సర్వే నంబర్ 840-బి1,841-బి1 ఆక్రమించి అక్రమ కట్టడాలు కడుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు, దీనికి సంబంధించి అనేకసార్లు కేసీ కెనాల్ కు సంబంధించిన సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని వారు చర్చించుకుంటున్నారు, అలాగే అక్కడ భూమి కలిగిన కొంతమంది రైతులు తమ పొలాలలోకి వెళ్లేందుకు దారి లేకపోవడంతో వారు కేసీ కెనాల్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు, చెన్నూరుకు సంబంధించిన రైతు అంబవరం భాస్కర్ రెడ్డి కేసీ కెనాల్ అక్రమ కట్టడాల పైన కేసీ కెనాల్ ఏఈ జమాల్ వలికి ఈ విషయంపై ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని, చూసి చూడనట్లు ఉండాలని ఏఈ తెలిపినట్లు రైతు భాస్కర్ రెడ్డి మండిపడుతున్నారు, తమ పొలానికి వెళ్లేందుకు దారి లేక సదరు అక్రమ కట్టడాలు కట్టిన వ్యక్తిని అడిగితే నీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకో నా ఇష్టం వచ్చినట్లు ఆక్రమించి కట్టుకుంటా, కేసీ కెనాల్ అధికారులకు లేని నొప్పి, నీకెందుకు అని అతనిపై దుర్భాషలాడినట్లు అమ్మవరం భాస్కర్ రెడ్డి విలేకరులకు తెలిపారు, పలుసార్లు ఈ విషయమై కేసీ కెనాల్ అధికారులకు తెలియజేసినప్పటికీ, వారు చూసి చూడనట్లు ఉండాలని భాస్కర్ రెడ్డికి సలహా ఇచ్చినట్లు భాస్కర్ రెడ్డి కేసీ కెనాల్ అధికారులు తీరుపై అసహనం వ్యక్తం చేశారు, ఈ విషయమై ఆయన గ్రీవెన్స్ సెల్ ద్వారా కేసీ కెనాల్ అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దీనిపై సర్వే నిర్వహించాలని కోరినప్పటికీ కేసీ కెనాల్ అధికారులు కాలయాపన చేస్తున్నారని భాస్కర్ రెడ్డి ఆరోపించారు, ఈ విషయమై విలేకరులు కేసీ కెనాల్ ఏఈ జమాల్ వల్లిని వివరణ అడగగా ఆయన స్పందిస్తూ ఈ విషయమై తమకు ఫిర్యాదు అందడం వాస్తవమని దీనిపై సర్వే నిర్వహించాలని చెన్నూరు తాసిల్దార్ కు తెలపడం జరిగిందని ఆయన తెలిపారు, తమకు కేసి కెనాల్ కు సంబంధించిన పనులు ఉన్నందున ఆగస్టు 3 వ తేదీ శనివారం రోజున అక్రమ కట్టడాలను పరిశీలించడమే కాకుండా దీనిపై సమగ్ర విచారణ చేపడతామని కేసీ కెనాల్ కు సంబంధించిన భూ సర్వే నిర్వహించి తమ హద్దులను ఏర్పాటు చేయడమే కాకుండా అక్రమ కట్టడాల దారులపై చర్యలు చేపడతామని ఆయన తెలియజేశారు, ఏది ఏమైనాప్పటికీ కేసీ కెనాల్ కు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా వాటి సరిహద్దులు ఏర్పాటు చేసి, సంబంధిత అధికారులు వాటిని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని అటు రైతులు ఇటు స్థానిక ప్రజలు కోరుతున్నారు.

About Author