సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ ఉద్యోగులు పనిచేయాలి
1 min readవివిధ శాఖల అధికారుల అప్రమత్తం చేస్తూ కీలక నిర్ణయాలు
బడేటి చంటి ఏలూరు ఎమ్మెల్యే
రివ్యూ మీటింగులో అధికారులు కు సూచనలు సలహాలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళుగా ముందుకెళ్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో పయనింపజేయడమే లక్ష్యంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ శాఖల అధికారులను అప్రమత్తం చేస్తూ, ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నారు. ఇదేక్రమంలో తాజాగా ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏలూరు కార్పొరేషన్ ఏఈలు, డీఈలు, ఎస్‌ఈలతో ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పనుల పరోగతిని స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన ఆదేశాలను జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలపడమే తమ లక్ష్యమన్నారు. రోడ్ల మరమత్తులు, డ్రైన్లలో షిల్ట్ తొలగింపుతో పాటూ అవసరమైన చోట తాత్కాలిక ప్రాతిపదికన కచ్చా డ్రైన్లను త్రవ్వించి నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు. వర్షాకాలం అనంతరం అవసరమైన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టనున్నామని అన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, పలువురు అధికారులు పాల్గొన్నారు.