ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిన..మాల మహానాడు
1 min readసుప్రీం కోర్టు తీర్పును అప్పీల్ చేస్తాం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మాల మహానాడు కార్యాలయంలో ఏసీ నాగేష్ అధ్యక్షన జరిగిన సమావేశంలో ఎనుము రాజకుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో వారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణను వతిరేకిస్తున్నాం వాళ్ళు మాలల కన్నా మాదిగలే రాజకీయంగా ఆర్థికంగా ముందంజలో ఉన్నారని మరీ వర్గీకరణ తీసుకొచ్చి అన్ని విధంగా మాలలకు అన్యాయం చేస్తున్నారు ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం లేనిపక్షంలో మేము మా కార్యచరణను ప్రకటిస్తాం ఏదేమైనా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎస్సీలను విభసిస్తు ఒకే వర్గానికి చెందిన వారిని పావుగా వాడుకుంటూ ఓటు బ్యాంకుగా మలుచుకొని తద్వారా ఎస్సీలను వర్గీకరణ చేసి ఐక్యతను దెబ్బతీసి మనువాద చేతిలో కీలుబొమ్మై వారికి మనం ఉపయోగపడేలా ఉన్నాం బాధాకరం ఏది ఏమైనా మాలలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని ఏడు మందితో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అప్పీల్ చేస్తూ 9 మంది ధర్మాసనుకో అప్పీల్ కి వెళ్తాం ఈనెల 9వ తారీకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాను లక్షలాది మాలలు ఢిల్లీలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బొల్లవరం మనోహర్,సురేష్ కుమ్మరి రతన్ స్వామి,రాజు వీపనగండ్ల పుల్లయ్య దేవరాజు పాల్గొన్నారు.