బీసీ హాస్టల్ వార్డెన్ ను విధుల నుంచి తొలగించాలి
1 min readఏఐఎస్ఎఫ్ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న బీసీ హాస్టల్ వార్డెన్ ను విధుల నుండి తొలగించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి థామస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక బీసీ హాస్టల్ విద్యార్థులతో ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి థామస్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న విద్యార్థులకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇష్టానుసారం హాస్టల్ కు రావడం తప్ప విద్యార్థుల గురించి పట్టించుకోకుండా పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి బిసి హాస్టల్ వార్డెన్ వెంటనే విధుల నుండి తొలగించాలని డిప్యూటీ తాసిల్దార్ రాఘవేంద్ర వినతి పత్రం అందజేశారు. అలాగే బీసీ హాస్టల్లో నీటి సదుపాయం లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని స్నానం చేయడానికి నదుల నుండి గ్రామంలో ఉన్న కొళాయిలను వాడుకుంటూ విద్యను అభ్యసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున స్థానిక అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు తాగునీరు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వీరేష్, నాగరాజు, రామస్వామి, మురళి, కృష్ణ, రాజేష్ విద్యార్థు పాల్గొన్నారు.