PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దీప్ మేళాను ప్రారంభించిన కావ్య కిషన్ రెడ్డి

1 min read

– దేశ నలుమూలల నుండి వచ్చిన వస్తువులు

– మూడు రోజుల పాటు  హైటెక్స్ లో దీప్ మేళా

పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : అటల్ బిహారీ వాజపేయి ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ శ్రీమతి కావ్య కిషన్ రెడ్డి గారు హైటెక్స్ లో దీప్ మేళా ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ మేళా మూడు రోజుల పాటు నిర్వహిస్తారని దీప్ మేళా అధ్యక్షురాలు  శ్రీమతి రాధిక మలానీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కావ్య కిషన్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 200పైగా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన కాళాకృతులు, దుస్తువులు, ఇతర గృహోపకరాణాలు అన్నీఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ మేళా ద్వారా వచ్చిన ఆదాయంతో దీపిక్షా మహిళా క్లబ్ స్వతంగా పాఠశాలను నిర్వహించడం గర్వించదగిన విషయం. దీపిక్షా మహిళా క్లబ్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. 60 ఏళ్ల సుదీర్ఘ వారసత్వంతో, ఈ క్లబ్ ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు మద్దతు అందించడంలో మరియు ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంలో కృషి చేస్తుంది. 1987 నుండి దీపిక్షా మహిళా క్లబ్ కన్యక గురుకుల్ హై స్కూల్‌ను నిర్వహించి, సుమారు 1700 విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తుంది. దీపిక్షా మహిళా క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి రాధిక మలానీ మాట్లాడుతూ  క్లబ్ సభ్యులు దీప్ మేళా కోసం సన్నాహాలు చేశారు. ప్రతి ఒక్కరి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఆగస్టు 2 వ తేదీ నుండి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ మేళా జరగుతుందని తెలిపారు. ఈ మేళా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ మేళాలో ప్రదర్శించబడే ఉత్పత్తులు ఎలైట్ ఆభరణాలు, డిజైనర్ వస్త్రాలు, చేతిపనులు, జీవనశైలి వస్తువులు, బహుమతులు, పోషకాహార గృహ ఉత్పత్తులు, చర్మ సంరక్షణ ఉత్పత్తులు వంటి ఎన్నో రకాలు ఉన్నాయని వివరించారు.

 దీప్ మేళా ప్రాంగణ వివరాలు

ప్రాంగణం: హాల్ నెంబర్ 3, హైటెక్స్ ప్రదర్శన మైదానం, కొండాపూర్, హైదరాబాద్తేదీలు: శుక్రవారం, ఆగస్టు 2, 2024 నుండి ఆదివారం, ఆగస్టు 4, 2024సమయాలు: ఉదయం 10:00 నుండి సాయంత్రం 8:00 వరకుదీపిక్షా మహిళా క్లబ్ సభ్యలు  2024-25అధ్యక్షురాలు: శ్రీమతి రాధిక మలానీఐపీపీ: శ్రీమతి సునీత గగ్గర్ఉపాధ్యక్షురాలు: శ్రీమతి ప్రియాంక బహేటికార్యదర్శి: శ్రీమతి సంజీత జైన్, ఖజానాదారు: శ్రీమతి భావన సంగ్ఘి, సహ కార్యదర్శి: శ్రీమతి మీనాక్షి భురారియా, సహ ఖజానాదారు: శ్రీమతి శివాని తిబ్రివాల్, సభ్యురాలు: శ్రీమతి ఇంద్ర దొచనియా. సలహాదారు: శ్రీమతి ఉషా సంగ్ఘి.

About Author