ఆగస్టు నెల స్కూలు కాంప్లెక్స్ తేదీ మార్చండి – ఆప్టా
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎస్. సి. ఈ. ఆర్. టీ. వారు 2024- 25 విద్యా సంవత్సరానికి గాను అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసి ఉన్నారు . క్యాలెండర్ ప్రకారము ఆగస్టు నెలలో 16 మరియు 17 తేదీలలో స్కూల్ కాంప్లెక్స్ లు నిర్వహించమని సూచించి ఉన్నారు .కానీ ఆగస్టు 16వ తేదీ హిందూ మహిళలకు అత్యంత ప్రాధాన్యమైన వరలక్ష్మీ వ్రతం కావున చాలామంది మహిళా ఉపాధ్యాయిని లను దృష్టిలో ఉంచుకొని 16వ తేదీన ఆప్షన్ హాలిడే గా ప్రకటించడం అయినది, ఎస్ సి ఈ ఆర్టీ వారు విడుదల చేసిన వార్షిక క్యాలెండర్ చూసి మహిళ ఉపాద్యాయులు ఆందోళనకు గురి అవుతున్నారు. కావున స్కూల్ కాంప్లెక్స్ తేదీని 16 ఆగస్టు కాకుండా 19 ఆగస్టు మార్పు చేయగలరని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గణపతి రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రావు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు కి మరియు విద్యా శాఖ ఉన్నత అధికారులకు లేఖ ద్వారా వినతి కోరటం జరిగింది.