వైభవంగా రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారికి చీరె సారె
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండల కేంద్రమైన చెన్నూరు పరమట వీధిలో వెలసిన శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారికి ఆషాడ మాసం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వందలాది మంది మహిళలు భక్తులు చీరె సారె సమర్పించారు. తెల్లవారుజామున 5 గంటలకు అమ్మవారికి అభిషేకం అర్చన నిర్వహించారు. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సరస్వతి నగర్లో వెలసి ఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర కు చెన్నూరులో పలు ప్రాంతాలకు చెందిన మహిళలు భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమ పూలు .పండ్లు గాజులు టెంకాయ. పిండి పదార్థాలు.చీర జాకెట్ తో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు చేరుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు కేరళ వాయిద్యాలతో ఊరేగింపుగా కొత్త రోడ్డు. భవాని నగర్. మెయిన్ రోడ్. నాగల కట్ట వీధి. మీదుగాపరమట వీధిలో వెలసి ఉన్న శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయం వరకు ఊరేగింపు కొనసాగుతుంది. ఈ ఊరేగింపులో పెద్ద ఎత్తున మహిళలు పూలు పండ్లు పిండి పదార్థాలు గంపల నిండా నింపుకొని చౌడేశ్వరి ఆలయం వరకు వచ్చారు. అనంతరం మహిళలు భక్తులు తెచ్చిన పూలు పండ్లుచీరె సారె ను అమ్మవారికి సమర్పించారు .అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారు దర్శనం అనంతరం మహిళలు భక్తులు కు కమిటీ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు.