భక్తిశ్రద్ధలతో పెద్దమ్మకు బోనాలు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ : ఆషాడ మాసం పురస్కరించుకొని భక్తులు పెద్దమ్మకు బోనాలు సమర్పించి ముక్కులు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్యాపిలి పట్టణంలోని మహిళలు ఉదయాన్నే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని పట్టణంలో కొండపైన వెలిసిన పెద్దమ్మకు మహిళలు బోనాల సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు మాట్లాడుతూ గ్రామ సుభిక్షంగా వుండాలని ,ఆయా ఆరోగ్యాలతో పాడిపంటలతో కొలువు తీరాలని అమ్మవారిని కోరినట్లు వారు తెలిపారు .