‘స్టాండింగ్ కమిటీ’లో నైతిక విజయం టీడీపీదే..
1 min readటీడీపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు
కర్నూలు, పల్లెవెలుగు:కర్నూలు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాల గురించి సాక్షి పేపర్లో రాసిన కథనాలపై తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మౌర్య ఇన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తమకు 15 మంది కార్పొరేటర్లు ఉన్నారన్నారు. తమకు మొత్తం 75 ఓట్లు రావాల్సి ఉండగా 106 ఓట్లు వచ్చాయని తెలిపారు. 31 ఓట్లు అదనంగా వైసీపీ కార్పొరేటర్లు వేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. దీన్ని బట్టి వాపు ఎవరిదో, బలం ఎవరిదో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఫలితాలను బట్టి ఎవరిది నైతిక విజయమో వారే ఆలోచించుకోవాలని హితవు పలికారు. మంత్రి టి.జి భరత్ స్థానికంగా లేకపోయినప్పటికీ సాక్షి కథనాల్లో మంత్రి వ్యూహం విఫలమైందని రాయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైసీపీ నాయకులే క్యాంపు రాజకీయాలు చేసి వారి కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు వేయించుకున్నారన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పొరేటర్లు కురువ పరమేష్, విజయ కుమారి, కైపా పద్మలతా రెడ్డి, సుజాత, తెలుగుయువత పార్లమెంటు అధ్యక్షుడు అబ్బాస్, సీనియర్ నాయకులు గున్నామార్క్, మోయిన్ బాషా, ఖాదర్ బాషా, సుంకన్న, స్వామిరెడ్డి, అకీమ్, రామాంజనేయులు, శేషు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.