ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితంగా పెద్దహ్యట గ్రామానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు
1 min readఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఉన్నంత అధికారుల ఆదేశాల మేరకు పెద్దహ్యట గ్రామానికి ఆర్టీసీ బస్సు ఈ రోజు నుండి ప్రతి రోజు ఈ గ్రామానికి బస్సు రావడం జరుగుతుంది అని ఆదోని ఆర్టీసీ డిపో అధికారులు తెలిపారు._ఆదోని డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ అసిస్టెంట్ మేనేజర్ రాఘవేంద్ర తెలిపారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ మాట్లాడుతూ మా పెద్దహ్యట గ్రామానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేసినందుకు ఆదోని డిపో అధికారులకు “అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్)”తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి రోజు విద్యార్థులు మా గ్రామం నుండి 40 మంది విద్యార్థులు ఉన్నంత చదువులు చదువుకోవడానికి మండల కేంద్రానికి వెళ్తారు. మా గ్రామం నుండి ప్రధాన రహదారికి 1.5 కిలోమీటర్ కాలినడక ద్వారా ప్రధాన రహదారికి విద్యార్థులు కాలినడక ద్వారా రావలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడనుండి మండల కేంద్రానికి 7 కిలోమీటర్లు రహదారి ఉంది. సరైన సమయానికి రవాణా సౌకర్యం లేక విద్యార్థులు ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు.ఈ రోజు నుండి ఆర్టీసీ బస్సు రాకతో ఆ సమస్యలన్నీ తీరినందుకు ఆదోని డిపో ఆర్టీసీ అధికారులకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు గ్రామస్తులు ప్రజలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనే వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు గ్రామస్తులు ప్రజలు కట్టే నాగరాజ్ శేషప్ప రంగయ్య రంజిత్ భీమేష్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.