స్వయం ఉపాధి శిక్షణను సద్వినియోగపరుచుకోవాలి : ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో ఈనెల 12న ఇంటర్నేషనల్ యూత్ డే ని పురస్కరించుకొని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా తెలుగు డీ.టీ.పీ లో ఉచిత శిక్షణ ప్రచార గోడ పత్రికలను పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత ,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ,గౌరు వెంకటరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఉప కార్యదర్శి లయన్ చిన్నస్వామి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. నాగరాజు ,కిష్టఫర్ ,దుగ్గపూటినాగిరెడ్డి తదితరులు ఆవిష్కరించారు. పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతినెలా 30 మంది నిరుద్యోగ యువతీ యువకులకు క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత జన్మదినం సందర్భంగా అభినందనలు .
పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత జన్మదినాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు, మొక్కలు ,పండ్లు బహుకరించి అభినందనలు తెలిపారు.