6 న వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు పట్టణంలోనిస్థానిక సీ క్యాంప్ డ్రైవర్ల అసోసియేషన్ భవనంలో మాల సంఘాల జేఏసీ ఉమ్మడి జిల్లాల అధ్యర్యంలో సంఘాల నాయకులు యాట.ఓబులేష్,మాల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాసారపు వెంకటేష్,ఇమ్మానియేల్, అడ్వకేట్ సుధీర్,రాజీవ్ కుమార్,మాదాసి నాగరాజు కుంద.వెంకటేశ్వర్లు, తదితరులు మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ వర్గీకర్ణ సుప్రీం కోర్ట్ తీర్పును వెతిరేకిస్తూ 6.8.2024 మంగళవారం ఉ.9:00 గం.కు కర్నూలులో అంబేద్కర్ భవనం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీతో వచ్చి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వెతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని మాల యువకులు,మాల లీడర్లు, మాల విద్యార్థులు,మాల మహిళలు,అందరూ కర్నూలు లో జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాల నాయకులు పి.రంగస్వామి తిరుపాలు,అడ్వకేట్ రవిరాజ్, నిత్యానంద రాజ్,జాన్ బాబు,బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.