నిరాడంబరంగా 11 లక్షల నగదు చెక్కులు పంపిణీ చేసిన అంజుమన్ సంస్థ
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: 2024-25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన 370 మంది ముస్లిం విద్యార్థులకు ఒక్కోక్కరికి రు.3000/- నగదు చెక్కులను నంద్యాల అంజుమన్ సంస్థ పంపిణీ చేసింది. అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ అధ్యక్షతన నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇమాముల సంఘం అధ్యక్షులు హాఫీజ్ అమ్జద్ బాషా సిద్దీఖ్, జమాఆతె ఇస్లామి అధ్యక్షులు అబ్దుల్ సమద్, అంజుమన్ ఉపాధ్యక్షులు సి.అబ్దుల్ హఖ్, కార్యదర్శి యం.డి.గౌస్, జీ.యం.మొహిద్దీన్,హిదాయతుల్లా, మున్నా, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖుద్దూస్ మాట్లాడుతూ ఈ సంవత్సరం అంజుమన్ కు ధరాఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థి విద్యార్థినికి రు.3000/- చొప్పున పదకొండు లక్షల విలువగల నగదు చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. నంద్యాల పేద విద్యార్థులు నిట్ ద్వారా ఎవరైనా మెడిసిన్ లో సీటు సాధిస్తే వారికి ఫీజులు అంజుమన్ కట్టడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. ముస్లిం అమ్మాయిలకు సాముహికంగా వివాహాలు చేసుకుంటే రు.50,000/- ఇస్తున్నట్లు తెలిపారు. హాఫీజ్ అమ్జద్ బాషా , అబ్దుల్ సమద్ మాట్లాడుతూ అంజుమన్ సేవలకు, ఇమాముల సంఘం, జమాఆతె ఇస్లామి,నంద్యాల ముస్లింల తరుపున అభినందిస్తు, అంజుమన్ ప్రజలది కాబట్టి పేద ముస్లింలు తమ అమ్మాయిల వివాహాలు అంజుమన్ సంస్థ ద్వారా చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఏ రాష్ట్రంలో కూడా అంజుమన్ లేదా ముస్లిం సంస్థలు ఇంత ఉదారంగా సహాయం చేయటం లేదని. నంద్యాల ముస్లింలకు ఇది గర్వకారణం అన్నారు.అనంతరం విద్యార్ధులకు చెక్కులు పంపిణీ చేసారు.