PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వం తీసుకునే ప్రతి అభివృద్ధి ,సంక్షేమ పథకాలు విజయవంతం చేస్తాం

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: ప్రభుత్వం తీసుకునే ప్రతి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సచివాలయ ఉద్యోగులుగా ఎల్లప్పుడూ ముందుండి విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకుని వస్తామని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు తెలిపారు.  స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు నెలలో పెన్షన్లు ఒక్కరోజులో 97% పెన్షన్లు పంపిణీ చేశామని అన్నారు. సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ప్రత్యేక సమస్యలను ఆయన మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నామని అని చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ప్రవేశం డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువలన రావలసిన బకాయిలను మంజూరు చేయాలని, సచివాలయ ఉద్యోగులకు ప్రవేశం డిక్లరేషన్ అయిన వాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించాలని ఆయన కోరారు. పదోన్నతి ఛానల్ క్రియేట్ చేసి పదోన్నతులు కల్పించాలని, ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగులకు ఏకరూప దుస్తులు విధానాన్ని రద్దు చేయాలని ,సచివాలయ ఉద్యోగులపై బహుళ శాఖ విధానం లేకుండా చేసి మాతృ శాఖ మాత్రమే అజమాయిషి ఉండాలని ఆయన కోరారు.   తదననంతరం ప్రధాన కార్యదర్శి వై రత్నం పుట్టి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులను వర్తిస్తున్న రూల్స్ అన్నీ కూడా మా సచివాలయ ఉద్యోగులకు కచ్చితంగా వర్తించేలా చూడాలని ,ప్రతిసారి పై స్థాయి అధికారులు సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక జీవోలు, సర్కులర్లు, అడగకుండా చూడాలని వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసి సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ  సహాధ్యక్షులు రమేష్ బాబు, ఉపాధ్యక్షులు హరి రవికుమార్ రెడ్డి అశోక్ కుమార్ ,మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

About Author