పార్వతి ఆత్మహత్యపై పూర్తి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని సుంకేశ్వరి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని పార్వతి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తామస్ డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని రచ్చుమర్రి మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న పార్వతి హాస్టల్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న విద్యార్థి నాయకులు రోడ్లపై బైఠాయించి పార్వతి కి న్యాయం చేయాలని దాదాపు గంటసేపు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అక్కడికి చేరుకున్న సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ విద్యార్థి నాయకులతో మాట్లాడి విద్యార్థినికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విద్యార్థిని కుటుంబానికి రూ 20 లక్షలు ఎక్స్గ్రేషియా తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం అక్కడికి చేరుకున్న రాజకీయ నాయకులతో మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరడంతో విద్యార్థి నాయకులు శాంతించి విద్యార్థిని యొక్క డెడ్ బాడీ వెళ్లేంతవరకు అక్కడే ఉండి కుటుంబానికి అండగా నిలిచారు.