తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం: ఐసీడీఎస్ సూపర్ వైజర్
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రతి తల్లి బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపు ముర్రుపాలు తాగించాలని దీంతో బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎలాంటి అంటువ్యాధులు సంభవించకుండా ఉంటాయని నంద్యాల జిల్లా పగిడ్యాల మండల ఐసీడీఎస్ సూపర్ వైజర్ శేషమ్మ తెలిపారు.సోమవారం మండల కేంద్రంలోని మూడవ అంగన్ వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని తల్లిపాల ప్రాముఖ్యతపై పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. బాలింతలకు ,గర్భిణీలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి పాలలో ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని బిడ్డను అనేక రోగాల నుండి సురక్షితంగా ఉంచుతాయన్నారు.తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డల మధ్య బంధాన్ని పెంపొందిస్తాయన్నారు.ఆరు నెలల పైబడిన శిశువులకు తల్లిపాలతో పాటు అదనపు ఆహారానికి కూడా అందించాలన్నారు.నవజాత శిశువు మానసిక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో తోడ్పడతాయన్నారు.మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే శిశువుకు సంపూర్ణ ఆహారం ఉన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త సునీత,ఆయాలు తదితరులు పాల్గొన్నారు.