గోసేవ ఎంతో గొప్పది.. మంత్రి టి.జి భరత్
1 min readకర్నూల్లో ఘనంగా మంత్రి టి.జి భరత్ బర్త్ డే వేడుకలు
గోమాత సన్నిధిలో జన్మదిన వేడుకలు జరుపుకున్న మంత్రి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గోమాతకు సేవ చేస్తే అంతా మంచి జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ చెప్పారు. కర్నూలు నగర శివారులోని డోన్ రోడ్డులోని గాయత్రీ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాయత్రీ గోశాలలో మంత్రి టి.జి భరత్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తన తండ్రి, మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి వెంకటేష్‌తో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత చండీ హోమం, ఆయుష్ హోమం చేశారు. అనంతరం గోవులకు గ్రాసం పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ జన్మదిన వేడుకలు, ఇతర శుభకార్యాల సమయంలో గోసేవ చేయడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. గోవుకి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు 33 కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లేనని పురాణాలు చెబుతున్నాయని తెలిపారు. గోసేవ చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయన్నారు. పవిత్రమైన గోశాలను ప్రతి ఒక్కరూ సందర్శించాలని మంత్రి టి.జి భరత్ పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రి నివాసంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సోమిశెట్టి నవీన్, తదితరులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.