ఏపీ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానం పై కార్యక్రమం
1 min readపాల్గొన్న వివిధ స్టడీ సెంటర్స్ కోఆర్డినేటర్స్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (దూర విద్యా విధానం) పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గుంటూరు-అమరావతి అందిస్తున్న కోర్సులు పై సోమవారం ఏలూరు జిల్లా జిల్లా పరిషత్ ఎంఈఓ కార్యాలయం లో సంబంధిత స్టడీ సెంటర్ కోఆర్డినేటర్స్ కు పి శ్రీనివాసరావు స్టేట్ కో-ఆర్డినేటర్ ఏపీఓఎస్ఎస్ గుoటురు మరియు ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ డీఈఓ కార్యాలయం ఏలూరు వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. చదువుకు దూరమైన వారికి, బడి మధ్యలో మానేసిన వారికి ఎస్ఎస్సిలో ఫెయిల్ అయిన వారికి, మరియు 14 సంవత్సరాల నుండి చదవగలిగిన మరియు రాయగలిగిన పరిజ్ఞానం కలిగిన ఎటువంటి విద్యార్హతలు లేనప్పటికీ ఆగస్టు 31, 2024 నాటికి 14 సంవత్సరాలు నిండిన వారందరూ అర్హులేనని. గరిష్ట వయోపరిమిత లేదని అన్నారు. ప్రవేశ రుసుము అందరికీ వంద రూపాయలు. అడ్మిషన్స్ ఫీజు జనరల్ కేటగిరి పురుషులకు 1,300/-రూపాయలు ఇతరులు అనగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దివ్యాంగులకు, (సిడబ్ల్యూ ఎస్ఎన్ డి) ట్రాన్స్ జెండర్లు మరియు ఎక్స్ సర్వీస్ మేన్ లకు 900/-రూపాయలు నిర్ణయించడం నిర్ణయించారన్నారు. దానిలో భాగంగా ఇంటర్మీడియట్ ప్రవేశ అర్హతలు పదవ తరగతి పూర్తి చేసి ఆగస్టు 31, 2021 నాటికి 15 సంవత్సరాలు నిండిన వారందరికీ ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం. ఇంటర్మీడియట్ కోర్సులకు గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు నుండి లేదా ఏపీఓఎస్ఎస్ ద్వారా పదవ తరగతి ఉత్తీర్లై ఉండాలి అన్నారు. గరిష్ట వయోపరిమితి లేదన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు అందరికీ 200/- రూపాయలు. అడ్మిషన్ ఫీజు జనరల్ క్యాటగిరి పురుషులకు 1400 రూపాయలు ఇతరులు అనగా మహిళలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, దివ్యాంగులకు, (సి డబ్ల్యూ ఎస్ ఎన్ డి. ట్రాన్స్ జెండర్లు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ లకు 1100/-వందల రూపాయలు నిర్ణయించారు అన్నారు.