PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆసుపత్రిలో వైద్య సేవలు బేష్..

1 min read

తాలూకాలో ఎక్కడా ఇలాంటి ఆసుపత్రి లేదు

ఉద్యోగులు ఇక్కడ జీతాలు తీసుకుంటే ఇక్కడే పని చేయాలి

మిడుతూరు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే జయసూర్య

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఇలాంటి ఆసుపత్రిని ఎక్కడా చూడలేదని ఇక్కడ ఆస్పత్రిని చాలా శుభ్రంగా ఉంచారని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు మిడుతూరు మండల కేంద్రంలోని సిహెచ్ సీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.ఎమ్మెల్యేకు ఆసుపత్రి డాక్టర్ తిరుపతి మరియు సిబ్బంది పూలబోకేతో స్వాగతం పలికారు.తర్వాత ప్రారంభమైన కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రిలో అన్ని పరికరాలు ఉన్నాయని వైద్యుల సేవలు బాగున్నాయి సిబ్బంది కొరత లేదని ఇక్కడి పల్లెలకు అందుబాటులో ఆస్పత్రి ఉంది ప్రైవేటు ఆసుపత్రుల వైపు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి పేద ప్రజలు వైద్య సేవలను పొందే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రికి ఏమైనా పరికరాల కొరత ఉంటే నా దృష్టికి తీసుకువస్తే నేను పరిష్కరిస్తానని అన్నారు.పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.ఇక్కడి నుండి జీతం తీసుకుంటున్న ఉద్యోగులు ఇక్కడే పని చేయాలి.ఇక్కడ జీతం తీసుకుంటూ ఎక్కడో పనిచేస్తే కుదరదు అలాంటి వారిని రద్దు చేయాలని ఇష్టం లేకపోతే అలాంటి వారు వెళ్లిపోవచ్చని ఎమ్మెల్యే అన్నారు.నేను వచ్చిన రోజే శుభ్రం ఉంచడం కాదు మిగతా రోజుల్లో కూడా ఈ విధంగానే ఆసుపత్రిని శుభ్రంగా ఉంచాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి నిధులు రెండు లక్షలు మంజూరయ్యాయని వీటిలో ఆసుపత్రి పరికరాలకు డాక్టర్ ఎమ్మెల్యేను అనుమతి కోరారు. ముందుగా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత రోగులను పలకరిస్తూ ఆస్పత్రిని అంతా కలియ తిరిగారు.ఈ కార్యక్రమంలో వైద్యులు భరత్,శారద,టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,ఎంపీడీఓ గంగావతి, వంగాల శివరామిరెడ్డి,ల్యాబ్ టెక్నీషియన్లు సత్యనారాయణ, జబీనా,కరీం సిబ్బంది మరియు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

About Author