మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా..
1 min readపాఠశాలకు త్రాగునీటి బోర్ మరియు విద్యుత్ స్తంభాలు వేయిస్తా:ఎమ్మెల్యే జయసూర్య
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మీ పిల్లలకు ఇలాంటి భోజనమే మీరు పెడతారా అంటూ నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య వంట నిర్వాహకులను మరియు ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న ఏపీ మోడల్ పాఠశాలలో మంగళవారం మ.ఒంటి గంటకు భోజన పథకాన్ని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు.భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అన్నం, కర్రీ సరిగ్గా లేదని మెనూ ప్రకారం చేయలేదని ఎమ్మెల్యే వారిపై మండిపడ్డారు.అంతే కాకుండా భోజనం ఏ విధంగా ఉంటుందని ఎమ్మెల్యే విద్యార్థులను అడిగారు. భోజనాలు సరిగ్గా లేనందున జిల్లా అధికారులకు రిపోర్ట్ పంపిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది కానీ నాణ్యమైన భోజనం అందడం లేదు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతోనే నియోజకవర్గంలోని పాఠశాలలు మరియు హాస్టళ్ల పైన దృష్టి సారించానని ఎమ్మెల్యే పాత్రికేయులకు తెలిపారు.తర్వాత ప్రిన్సిపాల్ సలీం భాష మరియు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులకు నీటి సమస్య ఉందని పాఠశాల రహదారికి విద్యుత్ స్తంభాలు లైట్లు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేకు వారు తెలుపగా బోర్ వేస్తానని హామీ ఇచ్చారు. నందికొట్కూరు విద్యుత్ ఏడీ కి ఎమ్మెల్యే ఫోన్ చేసి విద్యుత్ స్తంభాలు వేయించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి, నాగేంద్రుడు,రవీంద్రబాబు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.