తల్లిపాలే అమృతం: సూర్య కుమారి( సూపర్వైజర్)
1 min readముర్రుపాలలో పోషకాలు మెండు
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు అవగాహన
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు కొట్టాల చెరువు లోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సూర్య కుమారి పాల్గొని మాట్లాడుతూ పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లి పాలు పట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి గర్భిణులు, బాలింతలకు వివరించారు. అలాగే బిడ్డకు 6 నెలలు పూర్తయ్యే వరకు కేవలం తల్లి పాలు మాత్రమే తాగించాలని, ఇతర ఎలాంటి పానీయాలు పెట్టకూడదని సూచించారు. తల్లి పాలు ఆవశ్యకతను తల్లులకు అవగాహన కల్పించారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు పట్టవచ్చునని తల్లులకు సూచించారు. ఎక్కువగా ఆకుకూరలు తింటే ఆరోగ్యంగా ఉండడంతో పాటు లోపల పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారని తల్లులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సూర్య కుమారి తో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్త అరుణ తో పాటు గర్భవతులు బాలింతలు పాల్గొన్నారు.