సౌండ్ అండ్ లేజర్ షో” మూనాళ్ల ముచ్చటే- పనిచేయని లేజర్ షో
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైలం చరిత్రను భక్తులకు తెలియజేసేందుకు ఆలయ ప్రాంగణంలో నాగులకట్ట వద్ద కేంద్ర ప్రభుత్వం నిధులతో సౌండ్ అండ్ లేజర్ షో సిస్టంను శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసింది. రాత్రి వేళల్లో దేదీప్యమానాన్ని చాటాల్సిన సౌండ్ అండ్ లేజర్ షో మూలన పడటంతో విమర్శలకు తావిస్తోంది. శ్రీశైల క్షేత్రానికి వచ్చే పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం క్రింద కోట్ల రూపాయలను నిధులనుమంజూరు చేసింది. లేజర్ షో ప్రారంభించిన కొన్ని నెలలు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం సౌండ్ లేజర్ షో పనిచేయడం లేదు. కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా లేజర్ షో ఏర్పాటు చేసినా.., దేవస్థానం నిర్వహణ సరిగ్గా లోపం వల్ల లేజర్ షో ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా దేవస్థాన అధికారులు లేజర్ షోను భక్తులకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.