బిజెపి ప్రభుత్వ విధానాలు దేశానికి ప్రమాదకరం:సిపిఐ
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మతతత్వ ప్రజా వ్యతిరేక విధానాలు దేశానికి ప్రమాదకరమనీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంపన్న గౌడ్,జి.రంగన్న తెలిపారు.అనంతరం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఎమ్మిగనూరు గోనెగండ్ల నందవరం మండల గ్రామాలలోని శాఖ కార్యదర్శిల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి తిమ్మాపురం గ్రామ శాఖ కార్యదర్శి వెంకటేష్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంపన్న గౌడ్, జి.రంగన్న మాట్లాడుతూ ఈసారి సార్వత్రిక ఎన్నికలలో అతి కష్టం మీద మిత్రుల సహకారంతో అధికారంలో కొనసాగుతున్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు లాభం చేకూర్చే పద్ధతిలో ఈ మధ్యనే బడ్జెట్ను ప్రవేశ పెట్టడం జరిగిందని బడ్జెట్లో కార్మికులకు, కర్షకులకు,రైతంగానికి, మధ్యతరగతి సామాన్య ప్రజానీకానికి ఏ విధమైన ప్రయోజనం లేదని వారు తెలిపారు .రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన చట్టంలో హామీలను అమలు చేయకుండా రాజధానికి మాత్రమే 15 వేల కోట్లు అప్పుగా ఇవ్వడం అన్యాయమని,వెనుకబడిన రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్న నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తూ రైతులను,కార్మికులను విస్మయిస్తున్నారని, మరి ముఖ్యంగా అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతం నియోజవర్గాలలో అధిక భాగం వర్షాధార భూములే ఉన్నాయని నీటిపారుదల సౌకర్యంగా తక్కువగా ఉందని పంటలు లేక పంటలు పండగ రైతులు మహా నగరాలకు వలసలు వెళుతున్నారని వారు తెలిపారు. అధిక వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టు పొంగిపొర్లుతున్న సాధారణ రైతుల పొలాలకు నీరు ఇవ్వడంలేదని దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కాబట్టి తక్షణమే వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని కోరారు ఈ సమావేశంలో సిపిఐ ఎమ్మిగనూరు,గోనెగండ్ల మండల కార్యదర్శిలు బీటీ చిన్నన్న,నాగప్ప సిపిఐ సీనియర్ నాయకులు మద్దిలేటి నాయుడు తిమ్మ గురుడు,విరుపాక్షి నాయుడు,రాజీవ్,మాలిక్, శ్రీరాములు,శాంతప్ప,మన్సూర్, మల్లికార్జున,ఇస్మాయిల్,రెడ్డి, మరియు గ్రామాల శాఖ కార్యదర్శి పాల్గొన్నారు.