PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో ముఖ్యమంత్రి… ఉప ముఖ్యమంత్రి  భేటీ

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 5వ తేదీన రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి, రాష్ట్ర అభివృద్ధి పై అధికారులు తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లకు దిశా నిర్దేశం చేశారు.  సమావేశం అనంతరం సోమవారం రాత్రి  అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లతో కలిసి డిన్నర్ చేశారు. రాష్ట్రంలోని అందరూ జిల్లా కలెక్టర్లు, ఎస్పీ ల వద్దకు విడివిడిగా వెళ్లి జిల్లాలో అమలు జరుగుతున్న కార్యక్రమాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ తో సీఎం భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి  ని కలిసి జిల్లాలో రైతాంగం సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, పంటల రుణాల పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు.  పారిశ్రామికాభివృద్ధికి జిల్లాలో ఉన్న అవకాశాలపై, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.  పేదల జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు,  ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.     ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్న  నమ్మకం ప్రజలలో  పెంచేలా కలెక్టర్లు పనిచేయాలన్నారు. జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధిపదంలో నిలిపేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎం చెప్పారు.జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ తో సీఎం మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని,  డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సీఎం చెప్పారు.  అనంతరం డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ను  జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ లు కలిసి పలు అంశాలపై చర్చించారు.

About Author