వేదవతి ప్రాజెక్టును పి.ఎం.కె.సి.వై పథకంలోకి చేర్చాలి: కర్నూలు ఎంపీ
1 min readకేంద్ర జలశక్తి మంత్రికి వినతిపత్రం సమర్పించిన ఎం.పి నాగరాజు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలోని వేదవతి ప్రాజెక్టును ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకం క్రింద చేర్చాలని కేంద్ర జలశక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ ను కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు కోరారు… ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు.. ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు వేదవతి ప్రాజెక్టును పి.ఎం.కె.ఎస్.వై పథకం కింద చేర్చితే ప్రాజెక్టు వేగవంతం అవుతుందని, దీంతో సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవచ్చని మంత్రి పాటిల్ కి వివరించారు.. అంతే కాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా 80వేల ఎకరాలకు నీరు అందించవచ్చని, దీంతో అధిక సంఖ్యలో రైతులకు లబ్ది చేకూరి వలసలను అరికట్టవచ్చని, దీంతో పాటు కర్నూలు నియోజకవర్గానికి నీరు అందించడంలో వేదవతి ప్రాజెక్టు కీలకంగా మారుతుందని ఆయన కు తెలిపారు.