ఓ మోస్తారు వర్షం రైతులకు ఊరట
1 min readపెన్నా నదిలో పెరుగుతున్న నీటి ప్రవాహం
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు మండల వ్యాప్తంగా మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు మోస్తారు ఓ మోస్తారు వర్ష కురిసింది. చెన్నూరు మండల రెవిన్యూ అధికారులు 29.8. మిల్లీమీటర్లు వర్షపాతం గానమోదు చేశారు. రాత్రంతా ఓ మోస్తారు వర్షంకురవడంతో మండల వ్యాప్తంగా ఖరీఫ్ సాగులో రైతులు సాగుచేసిన మినుము ఇతర పంటలకు వర్షం మేలు చేకూర్చింది. వర్షం కారణంగా చెన్నూరు లోని భవాని నగర్. కడప కర్నూల్ జాతీయ రహదారిలోని కొత్త రోడ్డు వద్ద రోడ్లలో వర్షపు నీరు నిలిచిపోయింది. దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చెన్నూరు వద్ద పెన్నా నది ఉధృతి పెరిగింది. శ్రీశైలం జలాశయం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి వరద నీరు కుందున్నది కి వదలడంతో కుందూ నది నుంచి ఆది నిమ్మాయిపల్లి ఆనకట్ట వద్ద పెన్నా నదిలో చేరడంతో అక్కడ నుంచి చెన్నూరు మీదుగా దిగవనున్న సోమశిల జలాశయం లోకి నీరు పరుగులు పెడుతుంది. ఆది నిమ్మాయిపల్లి ఆనకట్ట వద్ద పెన్నా నదిలో 9 వేల 400 క్యూసెక్కులు వరద నీరు ప్రవహిస్తుండగా కడప కేసీ కెనాల్ కు. చెన్నూరు, బుడ్డాయిపల్లి, ముళ్లపల్లి. కేసి ఉపకాలవలకు 150 క్యూసెక్కుల నీరు కెనాల్ అధికారులు వదులుతున్నారు. చెన్నూరు వద్ద సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు కొండపేట పెన్నా నది వంతెన పై నుంచి నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. అలాగే ఆదినిమాయపల్లి ఆనకట్ట వద్ద నీటి ప్రవాహాన్ని కేసీ కెనాల్ అధికారులు పరిశీలిస్తున్నారు.