PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశ భక్తిని పెంపొందించే విధంగా స్వాతంత్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలి

1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దేశ భక్తిని పెంపొందించే విధంగా స్వాతంత్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం స్వాతంత్య దినోత్సవ వేడుకల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ    ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈనెల 15వ తేదీ ఉదయం 9 గంటల నుండి స్వాతంత్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  వేడుకల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు జాతీయ జెండా ను ఆవిష్కరిస్తారని, అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారన్నారు. జిల్లాలో అమలు జరుగుతున్నా సంక్షేమ , అభివృద్ధి పధకాలపై మంత్రివర్యులు సందేశమిస్తారన్నారు. అనంతరం దేశభక్తిని పెంపొందించే విధంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే విధంగా శకటాల ప్రదర్శన నిర్వహించాలన్నారు. అనంతరం వివిధ శాఖలచే అమలు జరుగుతున్న కార్యక్రమాలపై స్టాల్ల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలో ముందుగా ప్రతీ ప్రభుత్వ కార్యాలయం పై జాతీయ జెండా ఎగిరేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా  ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు.  జిల్లా, మండల స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలని, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు స్వాతంత్ర సంగ్రామం, దేశానికీ స్వాతంత్రం  సముపార్జనకు కృషి చేసిన త్యాగధనుల జీవితాలపై వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించాలన్నారు.  సమావేశంలో  ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి,  జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, ఆర్డీఓ ఎన్ .ఎస్.కె. ఖాజావలి, డి ఈఓ అబ్రహం,ఆర్ ఐ ఓ చంద్రశేఖర్, డీఆర్డీ ఏ పీడీ విజయరాజు, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, డ్వామా పీడీ పి . రాము, ఉప రవాణా కమీషనర్ శాంతికుమారి, డిసిహెచ్ ఎస్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. నాగేశ్వరరావు, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author