కర్నూలు టూ బళ్లారి కి హైవే ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నుంచి బళ్లారి కి హైవే ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలోని 167 జాతీయ రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు కోరారు.. ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో ఆయన్ని కలిసి వినతి పత్రం సమర్పించారు…ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ మంత్రాలయం నుంచి బళ్లారి కి వెళ్లే 167 జాతీయ రహదారి పనులు తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయని, ప్రత్యేకంగా ఈ రహదారిలో ఆదోని మరియు ఆలూరు మీదుగా ఉన్న రోడ్డు మార్గం పరిస్థితి అధ్వానంగా మారడంతో ప్రయాణికుల వాణిజ్యం , మరియు రవాణా పై ప్రభావం చూపుతుందని, ఈ కీలకమైన మార్గాన్ని ప్రత్యేక చొరవ తీసుకొని త్వరగా చేయాలన్నారు.. అలాగే కర్నూలు నుంచి బళ్లారి కి హైవే ఏర్పాటు చేయాలని, ఈ రహదారి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుందని , వాణిజ్యం , పర్యాటకం మరియు ప్రాంతీయ అభివృద్ధి ని సులభతరం చేస్తుందన్నారు.. ఇక ఈ రెండు విషయాలను కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకుపోయాయని , దీని పై ఆయన సానుకూలంగా స్పందించారని ఎం.పి నాగరాజు తెలిపారు.