తమ్మిలేరులో వరద ఉధృతి
1 min readనివారపుపేట కాజ్ వే పై రాకపోకలు నిలిపివేత, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి
ఆర్డీఓ ఖాజావలి
నగర పాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది చర్యలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : తమ్మిలేరు లో వరద నీరు ఉధృతి కారణంగా ఏలూరు శనివారపు పేట లో బ్రిడ్జి పైనుండి తమ్మిలేరు నీటి ప్రవాహం పెరగడంతో ముందు జాగ్రత్త చర్యగా శనివారపు పేట కాజ్ వే పై నుండి వరద ఉధృతి తగ్గేవరకూ తాత్కాలికంగా రాకపోకలను నిలిపివేసినట్లు మరియు వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు ఆర్డీఓ ఎన్ .ఎస్.కె. ఖాజావలి తెలిపారు. శనివారపుపేట కాజ్ వే వద్ద గురువారం తమ్మిలేరు వరద ఉధృతిని ఆర్డీఓ అధికారులతో కలిసి పరిశీలించారు. ఏలూరు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డా:మాలతి ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బందితో శనివారంపేట బ్రిడ్జిపై తమ్మిలేరు నీటి ప్రవాహం కు వచ్చు అడ్డంకులను, చెత్తను దగ్గరుండి తొలగిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏలూరు డిఎస్పి డి. శ్రావణ్ కుమార్, నగరపాలక సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.