PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ కు పరిశ్రమలను తీసుకొస్తాం..

1 min read

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్..

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్:  టిడిపి ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకుని రావడానికి ప్రత్యేక కార్యచరణ చేపట్టినట్టు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఓర్వకల్ వద్ద ఉన్న జయరాజ్ ఇస్పాల్ స్టీల్ పరిశ్రమ ప్రతినిధులతో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డితో కలిసి సమావేశం అయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిబీఎన్ బ్రాండ్ ద్వారా రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొని వస్తామని రాష్ట్రాల మధ్య పోటీ నెలకొన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్  హబ్ సాధించుకున్నామని త్వరలోనే ప్రత్యేక కార్యాచరణ ద్వారా పరిశ్రమలను ఇక్కడ తీసుకొని వస్తామని దాదాపు 2000 కోట్ల విలువగల పరిశ్రమలను తీసుకురావడమే టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలిపారు. ఉమ్మడి కర్నూల్ నంద్యాల జిల్లాలో భవిష్యత్తులో పరిశ్రమలకు పెద్ద పీట వేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫార్ములా ద్వారా  నిరుద్యోగ యువత కు ఎక్కడికక్కడ స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించేలా ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకొని పనిచేస్తున్నట్టు మంత్రి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిశ్రమలకు ఎటువంటి ప్రత్యేకత ఇవ్వకుండా నాశనం చేశారని కమిషన్ల కోసం కక్కుర్తి పడి రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా చేశారని టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉపాధి అవకాశాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టు జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలో మంత్రి టీ జీ భరత్ ద్వారా ప్రత్యేకంగా పరిశ్రమలు ఏర్పాటు అయ్యేటట్లు చొరవ తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గుట్టపాడు మోహన్ రెడ్డి. సుధాకర్ రెడ్డి. నాగిరెడ్డి. శ్రీరాములు. మహబూబ్ బాషా. సూర రాజన్న. టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author