ఎమ్మెల్యే ఆదేశాలతో సీజనల్ వ్యాధులు రాకుండా పటిష్ట చర్యలు
1 min readనివాస ప్రాంత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి
ఆగస్టు ఒకటి నుండి, 31 వరకు స్టార్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహణ
టిడిపి 3వ డివిజన్ ఇంచార్జ్ జాలా బాలాజీ
పల్లెవెలుగు, ఏలూరు జిల్లా ప్రతినిధి : వర్షాకాలం దృష్ట్యా నగరంలో సీజనల్ వ్యాధులుప్రబలకుండా పటిష్ట చర్యలుతీసుకున్నట్లు 3వ డివిజన్ ఇంచార్జ్ జాలా బాలాజీ తెలిపారు. నగరపాలక సంస్థ 1వ సర్కిల్ లోని 3వ డివిజన్ లో పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా జాలా బాలాజీ మాట్లాడుతూ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోఈనెల 1వ తేదీ నుండి ఆగస్టునెల 31వ తేదీ వరకు స్టార్డయేరియా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీజనల్ వ్యాధులు రాకుండామలేరియా విభాగంతో సమన్వయ పరచుకుంటూ సోమవారం డివిజన్ ప్రాంతంలో దోమల లార్వా నిర్మూనలకు స్ప్రేయింగ్, మురుగు కాలువకల్వర్టు కింద , ఖాళీ స్థలాలలో ఫాగింగ్, చేసినట్లు చెప్పారు.ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ మాలతి, శానిటరీ ఇన్స్పెక్టర్ బోను రాజు, సానిటరీ మేస్త్రి బట్టు రంగారావు, శానిటరీ సెక్రటరీ డి.ధనుష్, శానిటరీ సిబ్బంది, ఎ.ఎన్.ఎం, టిడిపి 3వ డివిజన్ అధ్యక్షులు శానపతి వెంకటరమణ,యు రూపేష్, బొంగా కొండ, వేణు, టిడిపి కార్యకర్తలు, డివిజన్ ప్రజలు, పాల్గొన్నారు.