ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ..ఢిల్లీలో మాలలు ధర్నా
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని ఆంధ్ర తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద వర్గీకరణను మరియు క్రిమిలేయర్ కు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.మాల మహానాడు రాష్ట్ర నాయకులు ఏదైతే బిజెపి పార్టీ తమ స్వలాభం కోసం సుప్రీంకోర్టును అడ్డు పెట్టుకొని ఎస్సీ వర్గీకరణను ఏర్పాటు చేసి దళితులకు రాజ్యాధికారం దూరం చేస్తూ దేశంలోని 35 కోట్ల మంది దళిత ప్రజలు ఏకమైతే తమ ఉనికి కి ఇబ్బంది కలిగి రాజ్యాధి కారములు దళితుల చేతుల్లోకి వెళ్తాయనే భావనతో ఆర్ఎస్ఎస్ చేసిన కుట్రలో భాగంగా మేము అనుమానిస్తున్నాం ఈ వర్గీకరణ ఆపి దళితులకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టుకు అప్లికేషన్ వర్గీకరణ పేరుతో రాబోయే రోజుల్లో వర్గీకరణ కుట్ర జరుగుతుందని దళితులను పావులుగా వాడుకొని రిజర్వేషన్ పేరుతో ఈ విధంగా కుట్ర అనే భావన వ్యక్తం అవుతుంది కావున మాల సోదరులంతా 21 తారీకు జరిగే భారత్ సంపూర్ణ మద్దతు పలుకుతూ బంద్ విజయవంతం చేయ చేయాలని వారు కోరారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ నాయకులు తాళ్లపల్లి రవి జిల్లా అధ్యక్షుడు వేల్పుల విజయ్ నియోజకవర్గ నాయకులు తాళ్లపల్లి ఏషప్ మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ జోసెఫ్ శోభ పాల్గొన్నారు.