జగన్..చంద్రబాబు పాలనకు చాలా తేడా..
1 min read-జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం
-27 దళిత పథకాలను తొలగించిన జగన్
-ప్రజల అవకాశం..కక్ష సాధింపులకు కాదు
-మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డ నందికొట్కూరు ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు చాలా తేడా ఉందని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. శనివారం సా 4:30 కు నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.గత ఐదేళ్ల జగన్ పాలన ప్రభుత్వంపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లలో 27 దళిత పథకాలను తొలగించారని అమరావతిలో చేపట్టిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిర్మాణానికి 258 కోట్లు వైసీపీ నేతలు స్వాహా చేశారని ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 40 వేల కోట్లు దారి మళ్ళించారని అన్నారు. దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను వైసీపీ నేతలు కొట్టేశారని ప్రజల పథకాలు దారి మళ్ళించి అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందని జగన్ దళితులపై చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు.డాక్టర్ సుధాకర్ ను అన్ని విధాల చిత్రహింసలకు గురి చేశారు.ప్రజలు అవకాశం ఇచ్చింది కక్ష సాధింపులకు కాదని అన్నారు.ప్రజలకు మంచి పాలన అందించాలనే ప్రజలు మనకు అవకాశం కల్పించారని కక్చ సాధింపులు మనకు వద్దు ఎక్కడ కూడా ప్రజల పట్ల కక్షపూరితంగా వ్యవహరించ వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.ఆయన అడుగు జాడల్లోనే మేమంతా నడుస్తున్నామని రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతుల పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మలు ఎవ్వరూ వేయించలేదని జగన్ మాత్రమే అలా చేశారని అందుకే జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపారని మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే జయసూర్య ఘాటుగా మాట్లాడారు.ఈ కార్యక్రమంలో రెండవ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, లాయర్ జాకీర్,పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి,ముర్తుజావలి, రసూల్ పాల్గొన్నారు.