రాఘవేంద్రుని సప్తరాత్రోత్సవాలకు వేలాయో
1 min readఈ నెల 18 నుండి ఆరాధనోత్సవాలు ప్రారంభం
20 న పూర్వరాధన, 21 న మధ్యారాధన, 22 న ఉత్తరరాధన (మహారథోత్సవం)
అన్ని ఏర్పాటు చేసిన మఠం అధికారులు
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : కలియుగ ప్రత్యక్ష దైవం, పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున జీవసమాధి అయిన శ్రీ రాఘవేంద్రుని సప్తరాత్రోత్సవాలకు వేలాయింది. ఈ నెల 18 నుండి శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సప్తరాత్రోత్సవాలలో భాగంగా 18 నుండి 24 వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 20 న పూర్వరాధన, 21 న మధ్యారాధన, 22 న ఉత్తరరాధన (మహారథోత్సవం) జరగనున్నాయి.