PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

షష్ట్యిపూర్తి” సందర్భంగా”హిందూ ఆత్మీయ సమ్మేళనాలు ” నిర్వహించాలి

1 min read

విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి వెంకటరామయ్య ——–

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా  సమావేశము 11/8/24,ఆదివారం రోజున విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఉ.10:30 నుండి మ: 3:30 వరకు జరిగింది. సమావేశానికి ముఖ్య వక్తగా విచ్చేసిన విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి వెంకట రామయ్య మాట్లాడుతూ…విశ్వ హిందూ పరిషత్ (1964 – 2024 ) ఈ ఆగష్టు 26 వ తేదీన వచ్చే శ్రీ కృష్ణ జన్మాష్టమి కి 60 సం.లు పూర్తి చేసుకోబోతోందనీ, 2023 శ్రీ కృష్ణాష్టమి నుండి 2024 శ్రీ కృష్ణ జన్మాష్టమి వరకు జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలలో, నగరాల్లోని అన్ని వీధుల్లో  విశ్వ హిందూ పరిషత్ సమితుల నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని కార్యకర్తలు దీక్షతో దాదాపు లక్ష్యాన్ని చేరుకున్నారని అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.విశ్వ హిందూ పరిషత్ స్థాపనా దివస్ సందర్భంగా ప్రతి లక్ష జనాభాకలిగిన ప్రఖంఢ డివిజన్ కేంద్రంగా ” హిందూ ఆత్మీయ సమ్మేళనం” నిర్వహించాలని తెలియజేశారు.విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కాకర్ల రాముడు మాట్లాడుతూ….ఆగష్టు 16 నుండి 31 వరకు ప్రఖంఢ కేంద్రాలలో నిర్వ హించబోయే హిందూ ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొనడానికి అయోధ్య రాముడి అక్షతల వితరణలో పాల్గొన్న హిందూ బంధువులను, అయోధ్య శ్రీ రాముడి ఆలయానికి నిధిసమర్పణ చేసిన వారిని, ప్రఖంఢలలో ఉన్న ప్రముఖులను కుటుంబాలతో సహా ఆహ్వానించాలని మార్గదర్శనం చేశారు.కర్నూలు జిల్లా అధ్యక్షులు టి.సీ.మద్దిలేటి మాట్లాడుతూ…ప్రఖంఢలలో నిర్వహించే స్థాపనాదివస్ సందర్భంగా హిందూ ఆత్మీయ సమ్మేళనాలలో కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయొలని పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్, రాష్ట్ర సేవా ప్రముఖ్ పి.పీ.గురుమూర్తి , రాష్ట్ర కార్యాలయ సహాయక్ భూపాలాచారి, ధర్మ ప్రసార్ విభాగ్ కన్వీనర్ కాళంగిరి విజయుడు, బజరంగ్ దళ్ కన్వీనర్ మీనుగ రాజేష్ ,సామాజిక సమరసత విభాగ్ టోలీ సభ్యులు నీలి నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు సోమిశెట్టి సురేష్, జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, సహకార్యదర్శి ఈపూరి నాగరాజు, కోశాధికారి అయోధ్య శ్రీనివాస రెడ్డి, మాతృ శక్తి కన్వీనర్ శ్రీమతి జంపాల రాధిక, దుర్గా వాహిని కన్వీనర్ శ్రీమతి ఈపూరి లక్ష్మీ,ప్రసార – ప్రచార కన్వీనర్ రామకృష్ణ, జిల్లా బజరంగ్దళ్ సాయిరాం, తెలుగు భగీరథ, మండ్ల హరి, శివ సాయినాథ్, గుజరాతి సురేష్, రాము, శివకోటి చంద్రశేఖర్, సల్కాపురం బాబురావు, నటరాజ్, కిరణ్, దాదిపోగురాజు, దాదిపోగు చంద్ర,జేపీ జయప్రకాశ్ సింగ్, జిల్లా ధర్మ రక్షకులు తదితరులు పాల్గొన్నారు.

About Author