దోమలు కంపచెట్లతో నిండిపోయిన ప్రభుత్వ కార్యాలయాలు..
1 min readమరమ్మతులకు గురై మూలనపడ్డ ఫాగింగ్ యంత్రాలు..
పల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు కంపచెట్లు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి సాయంత్రం అయితే చాలు దోమలతో ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే అర్జీదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్. ఎమ్మార్వో కార్యాలయం. ఎంపీడీవో కార్యాలయం. ఉపాధి హామీ కార్యాలయం. గ్రామ సచివాలయాలు. ఉన్న పరిసరాలలో ఎటువంటి పారిశుద్ధ్యం నిర్వహించక అధికారులు విచిత్ర వాతావరణంలో పాలన కొనసాగిస్తున్నారు వర్షాకాలం కావడంతో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగిపోయి సాయంత్రం అయితే దోమలు కరవడం వల్ల బొబ్బలు అలర్జీ వస్తున్నాయని ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు ఇప్పటికైనా గ్రామంలో పిచ్చి మొక్కలను తొలగించాలని దోమలకు ఫాగింగ్ చేయాలని కోరుతున్నారు .