మత్స్య సహకార సంఘంలో నూతన సభ్యులను చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి
1 min readఏ పి ఎం బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ గడివేముల: (గడివేముల )గని గ్రామం లోని మత్స్య సహకార సంఘం లో చేపల వృత్తి పై ఆధారపడి 200 కుటుంబాలు 30 సంవత్సరాలు గా జీవనం కొనసాగిస్తున్నారని అధికారుల నిర్లక్ష్యం తో సొసైటీ లో కొత్త సభ్యులను చేర్చుటలేదు అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి కి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నాడు వినతి పత్రం సమర్పించారు .అనంతరం ఆయన మాట్లాడుతూ గని మత్స్య సహకారా సంఘం లో గత 2దశబ్దాల ముందు గని గ్రామంలోని బెస్తలు 200కుటుంబాలు చేపల వేటపై ఉపాధి పొందేవారు కానీ దశబ్ద కాలంగా సొసైటీ లో కొత్త సభ్యులను చేర్చకపోవడంతో 16మంది సభ్యులతో మాత్రమే సొసైటీ కొనసాగుతుంది కావున బెస్తల పై దయాతలచి నూతన సభ్యులను చేర్చేవిదంగా చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. స్పoదించిన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ త్వరలో మత్స్యశాఖ అధికారులతోసమావేశంనిర్వహించి.నియోజకవర్గంలోని ప్రతి మత్స్యస హకారాసంఘం లోని సభ్యులు ఎదురుకుంటున్న సమస్యలను పరిష్కరిస్తాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో బెస్త సాధికార కమిటీ జిల్లా అధ్యక్షులు పీజీ వెంకటేష్., చేపల ముని, గుర్రం వెంకటరమణ, ఈశ్వర్ ప్రసాద్, మద్దిలేటి, సామన్నా,నాగరాజు, సురేష్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.